Pages

Thursday, October 14, 2010

పండగల గురించి

చిన్నప్పటి మాట అనగా ౪౦ సంవస్తరముల నాటి మాట. పండగలంటే ఎంతోసంతోషంగా వుందీది. దసరా వస్తుందతేనే ఎంతో సరదాగా వుండేది. దాదాపు ఒక మాసం ముందునుండే ఎంతో ఆశతో కొత్త బట్టల గురించి పండగ రోజుల సందడి గురించి ఎన్నో కలలుకనే వాళ్ళం. మా నాన్నప్రభుత్వ ఉద్యోగస్తుడు కాబట్టి మా ఇంట్లో పండగ మహా సంబరంగా వుండేది. ఒక సంవత్సరం ఇలాగే చక్కని డ్రెస్ కుట్టించారు నాకు. ప్రొద్దున్నే పూజలు గట్రా అయ్యినతరువాత వెంటనే హాఫ్ ప్యాంటు (చెడ్డి) వీసుకుని ఆశ్చర్య పొయ్యాను. నాకు అసలు కుట్టు నచ్చ లేదు. ఇక ఏడవడం మొదలుపెట్టాను. ఏడుస్తూ చెడ్డిని దూరంగా విసిరి వేశాను అది అలాగే నిలుచున్నట్టుగా పడింది. అది చూసి నవ్వడం ఇంటిల్లిపాది వంతయ్యింది. వాళ్ళంతా నవ్వుతున్నారని నేను మరీబిగ్గరగా ఏడవడం. ఇలా సాగింది నా పండగ.